Andhra Pradesh: 2021 సెలవుల జాబితాను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!

General Holidays Released by Andhra Pradesh Govt
  • ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సీఎస్
  • ఆదివారం నాడు ఒక్క సాధారణ సెలవు మాత్రమే
  • మిగతా అన్ని సెలవులూ పనిదినాల్లోనే

2021 సంవత్సరానికి గాను సాధారణ సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ సెలవుల్లో ఒక్క ఆగస్టు 15 మాత్రమే ఆదివారం నాడు రాగా, మిగతా అన్ని పండగలూ పనిదినాల్లోనే ఉండటం గమనార్హం. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక సాధారణ సెలవులను పరిశీలిస్తే...
జనవరి 13, బుధవారం నాడు భోగి, 14 గురువారం మకర సంక్రాంతి, 15 శుక్రవారం కనుమ పండగలు ఉంటాయి. ఆపై అదే నెలలో 26వ తేదీ మంగళవారం రిపబ్లిక్ డే ఉంటుంది. మార్చి 11 గురువారం మహా శివరాత్రి, 29 సోమవారం హోలీ పండగలుంటాయి.

మార్చి 2 శుక్రవారం గుడ్ ఫ్రైడే, 5వ తేదీ సోమవారం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, 13 మంగళవారం ఉగాది, 14 బుధవారం అంబేద్కర్ జయంతి, 21 బుధవారం శ్రీరామనవమి సెలవులు ఉంటాయి. మే 14 శుక్రవారం రంజాన్ రానుండగా, జూలై 21 బుధవారం బక్రీద్ సెలవుంటుంది.

ఆగస్టు 15 ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవం, 19, గురువారం మొహర్రం, 20 సోమవారం శ్రీ కృష్ణాష్టమి సెలవులు ఉంటాయి. సెప్టెంబర్ 10 శుక్రవారం వినాయకచవితి, అక్టోబర్ 2 శనివారం మహాత్మా గాంధీ జయంతి, 13 బుధవారం దుర్గాష్టమి, 15 శుక్రవారం విజయదశమి, 20 బుధవారం మిలాదున్ నబీ వస్తాయి.

నవంబర్ 4 గురువారం దీపావళి, డిసెంబర్ 25 శనివారం క్రిస్మస్ సెలవులు రానున్నాయి. ఇక కొత్త సంవత్సరంలో వారాంతాల్లో అధికంగా పండగలు ఉండటం, పలు పండగలకు ఒకటి లేదా రెండు రోజుల సెలవుతో లాంగ్ వీకెండ్స్ రానుండటం ఉద్యోగ వర్గాలకు శుభవార్తే.

  • Loading...

More Telugu News