శ్రీకాంత్ రెడ్డి సిగ్గుతో తలదించుకునేలా పులివెందుల రైతులు సమాధానం చెబుతారు: అశోక్ బాబు

15-12-2020 Tue 20:33
  • పిచ్చి ఆలోచనలు మానుకోవాలంటూ శ్రీకాంత్ రెడ్డికి హితవు
  • రైతులే బుద్ధిచెబుతారని స్పష్టీకరణ
  • చంద్రబాబు కులరాజకీయాలు చేయలేదని వివరణ
  • మీరే వందల పదవులు కట్టబెట్టారని ఆరోపణ
TDP MLC Ashok Babu fires in YSRCP MLA Srikanth Reddy
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రాయలసీమకు చంద్రబాబు ఏమీ చేయలేదని ఆరోపణలు చేసే ముందు శ్రీకాంత్ రెడ్డి ఓసారి పులివెందుల రైతులను అడగాలని స్పష్టం చేశారు. శ్రీకాంత్ రెడ్డి సిగ్గుతో తలదించుకునేలా పులివెందుల రైతులు సమాధానం చెబుతారని అశోక్ బాబు వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారు ఏం చేసినా ప్రజలు నమ్ముతారనే పిచ్చి ఆలోచనలు మానుకోవాలని శ్రీకాంత్ రెడ్డికి హితవు పలికారు. చంద్రబాబు కులరాజకీయాలు చేశాడని చెప్పడానికి శ్రీకాంత్ రెడ్డికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సలహాదారులు సహా వందల సంఖ్యలో కీలక పదవులను మీ వర్గం వారికి కట్టబెట్టలేదా? అని అశోక్ బాబు ప్రశ్నించారు.