New Year Celebrations: ఏపీలో కొత్త సంవత్సర వేడుకలు లేవు.... ఆ రెండ్రోజులు రాష్ట్రమంతటా కర్ఫ్యూ

  • కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిర్ణయం
  • డిసెంబరు 26 నుంచి జనవరి 1 వరకు అన్ని వేడుకలు రద్దు
  • బార్లు, వైన్ షాపుల వేళల కుదింపు
  • జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో సెకండ్ వేవ్
  • హెచ్చరించిన నిపుణులు
No new year celebrations in AP

కరోనా మహమ్మారి రెండో తాకిడి (సెకండ్ వేవ్) తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలు రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకు అన్నిరకాల వేడుకలు రద్దు చేసింది. ముఖ్యంగా, కొత్త సంవత్సరాది నేపథ్యంలో డిసెంబరు 31, జనవరి 1న వేడుకలు జరపరాదని స్పష్టం చేసింది. ఈ రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేయనున్నారు. రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంచే వేళలను కూడా కుదించనున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గినా, జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో కరోనా మరోసారి ప్రజ్వరిల్లే అవకాశం  ఉందని కేంద్రం వైద్య సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News