Lakshma Reddy: జనాలకు మంచి చేస్తే మరిచిపోతారు... సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

  • 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న సంగతి కూడా మర్చిపోయారు
  • రోజుకు 3 లేదా 4 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్తు ఇవ్వాలి
  • ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ పథకాలను ప్రారంభించాలి 
TRS MLA Lakshma Reddy suggests to stop all welfare schemes

టీఆర్ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచి చేస్తే మర్చిపోయే అవకాశం ఉందని అన్నారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయాన్ని కూడా మర్చిపోయారని... అందుకే రోజుకు 3 లేదా 4 గంటల పాటు మాత్రమే విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరాలనుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఆపేయాలని అన్నారు.

జనాలను మంచివారు అనాలో, లేక అమాయకులు అనాలో అర్థం కావడం లేదని లక్ష్మారెడ్డి చెప్పారు. సంక్షేమ పథకాలను ఇవ్వడం కూడా అనవసరమని... ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని అన్నారు. జడ్చర్లలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

  • Loading...

More Telugu News