Kajal Aggarwal: భర్తతో కలిసి 'ఆచార్య' సెట్లో కాజల్ సందడి... కొత్తజంటను ఆశీర్వదించిన చిరంజీవి

Kajal Aggarwal enters into Acharya set along with her husband and Chiranjeevi blessed the new couple
  • ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్
  • వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో వివాహం
  • కాజల్ దంపతులకు స్వాగతం పలికిన 'ఆచార్య' యూనిట్
  • సెట్స్ పై పూలదండలు మార్పించిన చిరంజీవి
  • కేట్ కట్ చేయించి అభినందనలు తెలిపిన వైనం
టాలీవుడ్ అందాలభామ కాజల్ అగర్వాల్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబయి వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కలిసి కాజల్ కొత్త జీవితంలో అడుగుపెట్టింది. కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' చిత్రంలో నటిస్తోంది. ఈ రోజు భర్త గౌతమ్ తో కలిసి కాజల్ 'ఆచార్య' సెట్స్ పైకి విచ్చేసింది.

ఈ సందర్భంగా ఆమెకు చిత్రయూనిట్ ఘనస్వాగతం పలికింది. చిరంజీవి కొత్త దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛాలు అందించి, దండలు మార్పించారు. సెట్స్ పై కేక్ కట్ చేయించి కాజల్, గౌతమ్ జోడీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం 'ఆచార్య' షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లోనే జరుగుతోంది.
Kajal Aggarwal
Chiranjeevi
Acharya
Gautam Kichloo
Tollywood

More Telugu News