మేము అధికారంలోకి వస్తే.. తమిళనాడుకు రెండో రాజధానిగా మదురై: కమలహాసన్ సంచలన ప్రకటన
- ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కమల్
- సభలకు అనుమతి ఇవ్వని పోలీసులు
- త్వరలోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుందన్న కమల్
తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న విషయాన్ని అతి త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్న ఆయన, త్వరలోనే థర్డ్ ఫ్రంట్ కు ఓ రూపాన్ని ఇస్తామని తెలిపారు. తన సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, నిబంధనలకు కట్టుబడే ప్రచారం సాగిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించడమే తన లక్ష్యమని తెలిపారు.
రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించగా, ఆయన్నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందో వేచి చూస్తున్నానని, ఆపై తప్పకుండా రజనీని కలుస్తానని అన్నారు. పాలనలో మార్పు తీసుకురావాలన్న నినాదంతో తన పార్టీ ముందడుగు వేస్తుందని కమల్ స్పష్టం చేశారు. కాగా, మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో ఎంఐఎం ఎన్నికల పొత్తును పెట్టుకుంటుందన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.