Virat Kohli: ఇన్ స్టాగ్రామ్ లో నరేంద్ర మోదీని అధిగమించిన విరాట్ కోహ్లీ!

Kohli Beats Modi in Instagram
  • అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా విడుదల
  • జాబితాను ప్రకటించిన హైప్ ఆడిటర్
  • ఇండియా నుంచి కోహ్లీ, మోదీ, అనుష్క, దీపిక
సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ లో ఓ అరుదైన రికార్డు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సొంతమైంది. హైప్ ఆడిటర్ అదే సంస్థ ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని సేకరించి, విశ్లేషించిన అనంతరం ఇన్ స్టాగ్రామ్ లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీని విరాట్ కోహ్లీ అధిగమించారని పేర్కొంది. హైప్ ఆడిటర్ జాబితా ప్రకారం, కోహ్లీ 12వ స్థానంలో ఉండగా, మోదీ 20వ స్థానంలో నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో విరాట్ భార్య అనుష్క 26వ స్థానంలో నిలిచారు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్ లో నంబర్ వన్ స్థానంలో ఫుట్ బాలర్ క్రిస్టియానా రొనాల్డో ఉండగా, మరో ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ నాలుగో స్థానంలో ఉన్నారు. ఇండియా తరఫున కోహ్లీ తొలి స్థానంలో, ఆపై మోదీ, అనుష్క, దీపికా పదుకొనే తదితరులు ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

ఇక ట్విట్టర్ సైతం ఈ సంవత్సరం అత్యధికులు ప్రస్తావించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడని ప్రకటించడం గమనార్హం. ధోనీ, రోహిత్ శర్మల కన్నా కోహ్లీ ఈ విషయంలో ముందు నిలిచారని, క్రీడాకారిణుల జాబితాలో గీతా ఫోగట్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఉన్నారని తెలిపింది. అత్యధిక లైక్ లను పొందిన ట్వీట్ గా, గత ఆగస్టులో తాను తండ్రిని కాబోతున్నానని కోహ్లీ చేసిన ట్వీట్ నిలిచింది.
Virat Kohli
Instagram
Narendra Modi
Anushka Sharma

More Telugu News