Bandi Sanjay: కేసీఆర్ పై తప్పకుండా కేసులు నమోదవుతాయి: బండి సంజయ్

  • రూ. 20 వేల కోట్లను దుర్వినియోగం చేసిన కేసీఆర్
  • ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందుగా చెప్పి దాడులు చేయదు
  • ఎందుకు ఢిల్లీకి వచ్చారన్న అనుమానాలు ఉన్నాయన్న సంజయ్
Bandi Sanjay Answer on Ed Raids on KCR

తెలంగాణలో కేసీఆర్ రూ. 20 వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు కుట్రను పన్నారని, ఆయన కేంద్ర పెద్దల వద్దకు వచ్చి, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా క్షమాపణకు అర్హుడు కాదని, ఆయన్ను క్షమించి వదిలేసే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నిన్న న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేసీఆర్ పై ఈడీ దాడులు జరుగుతాయా? అన్న ప్రశ్నను మీడియా సంధించగా, ఆసక్తికర సమాధానం చెప్పారు.

"ఎన్ ఫోర్స్ మెంట్ డెరెక్టరేట్ దాడులు చెప్పి జరుగవు. కేసీఆర్ పై తప్పకుండా కేసులు నమోదవుతాయి. ఆపై దర్యాఫ్తు జరుగుతుంది. ఈడీ వంటి సంస్థలు చెప్పి మరీ దాడులు చేస్తాయా?" అని బండి సంజయ్ ఎదురు ప్రశ్న వేశారు. కేసీఆర్ ఎందుకు ఢిల్లీకి వచ్చారన్న విషయంపై అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆయన, బీజేపీపై ఫైట్ చేస్తానని వచ్చిన ఆయన, ఏ చౌరస్తాలో తన కత్తిని దింపి, తిరిగి హైదరాబాద్ కు ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News