Tamil: తమిళ నటి చిత్ర మృతి కేసులో భర్త అరెస్ట్!

Tamil Actress Chitra Husbend Hemant Arrest
  • గత వారం ఆత్మహత్య చేసుకున్న చిత్ర
  • భర్తే కొట్టి చంపాడని పోలీసులకు ఫిర్యాదు
  • విచారించిన తరువాత కొట్టాడని తేల్చిన పోలీసులు
తమిళ బుల్లితెర నటి చిత్ర భర్త హేమంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హేమంత్ తన కుమార్తెను కొట్టి చంపాడని, ఆపై ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడని చిత్ర తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. హేమంత్ పై ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టు తెలిపారు.

ఈ నెల 10న చెన్నైలోని ఓ హోటల్ లో 29 సంవత్సరాల చిత్ర, ఆత్మహత్య చేసుకుని కనిపించిన సంగతి తెలిసిందే. హేమంత్ కు, చిత్రకు ఇటీవలే వివాహం అయింది. ఓ టీవీ సీరియల్ లో భాగంగా, చిత్ర కొన్ని శృంగార దృశ్యాల్లో నటించగా, అందుకు హేమంత్ తీవ్రంగా అభ్యంతరాలను వ్యక్తం చేశాడని, ఈ విషయంలోనే వారిద్దరి మధ్యా గొడవలు జరిగాయని చెన్నై అసిస్టెంట్ కమిషనర్ సుదర్శన్ మీడియాకు వెల్లడించారు.

పలుమార్లు హేమంత్ ను విచారించిన తరువాతనే, అతను ఆమెను కొట్టాడని నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నామని, టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో చిత్రతో పాటు సెట్స్ లో ఉన్న ఆమె స్నేహితులనూ ప్రశ్నించామని ఆయన తెలిపారు.
Tamil
Actress
Chitra
Hemant
Arrest

More Telugu News