Kollywood: ప్రముఖ కళా దర్శకుడు కృష్ణమూర్తి మృతి

Tamil film director P Krishnamoorthy dead
  • కృష్ణమూర్తి వయసు 77 సంవత్సరాలు
  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైనం
  • సంతాపాన్ని ప్రకటించిన పలువురు సినీ ప్రముఖులు
ఈ ఏడాది సినీ పరిశ్రమలో ఎక్కువగా విషాదకర ఘటనలే జరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో మహమ్మారి బారిన పడి క్షేమంగా బయటపడ్డారు. తాజాగా మరో విషాదం నెలకొంది.

ప్రముఖ తమిళ సినిమా కళా దర్శకుడు (ఆర్ట్ డైరెక్టర్) పి.కృష్ణమూర్తి అనారోగ్యంతో మరణించారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. చెన్నైలోని తన ఇంట్లోనే ఆయన తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. గొప్ప కళా దర్శకుడిగా పేరుగాంచిన కృష్ణమూర్తి జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.
Kollywood
Director
Dead
P Krishnamoorthy

More Telugu News