Ambati Rambabu: కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అంబటి రాంబాబు

Ambati Rambabu discharged from hospital
  • ఇటీవల రెండోసారి కరోనా బారినపడిన అంబటి
  • హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • చికిత్స పూర్తయిందని వెల్లడి
  • రెండోసారి కరోనా సోకడం ఆందోళన కలిగించిందని వ్యాఖ్యలు
  • మీ ఆశీస్సులతో విజయం సాధించానని ఉద్ఘాటన
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇటీవల రెండోసారి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే, తాను కరోనా నుంచి కోలుకున్నానని అంబటి రాంబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా పాటించి హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స ముగించుకుని ఇవాళ గుంటూరు వచ్చానని వివరించారు. రెండోసారి ఇన్ఫెక్షన్ రావడం కొంత ఆందోళన కలిగించినా, మీ ఆశీస్సులతో విజయవంతంగా ఎదుర్కోగలిగానని తెలిపారు. త్వరలోనే మీ ముందుకు వస్తాను అంటూ ఉత్సాహం వ్యక్తం చేశారు.
Ambati Rambabu
Corona Virus
Re Infection
Apollo
Hyderabad
YSRCP

More Telugu News