Harish Rao: హైదరాబాద్ గోశాల నిర్వహణ కోసం రూ.1.50 లక్షల విరాళం అందించిన హరీశ్ రావు

Harish Rao donates to Hyderabad Goshala
  • నెల జీతం నుంచి విరాళం ప్రకటించిన హరీశ్ రావు
  • చెక్ ను గోశాల ప్రతినిధులకు అందించిన వైనం
  • గోవుల ఒకరోజు ఖర్చు నిమిత్తం విరాళం ఇచ్చినట్టు వెల్లడి
  • గోమాతలను పూజించడం మన సంస్కృతి అని వివరణ
సకల దేవతల స్వరూపం, దైవానికి ప్రతిరూపం గోవులు అని తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. గోవులను పూజించడం మన సంస్కృతి, సంప్రదాయం అని వివరించారు. అందుకే హైదరాబాదులోని గోశాల నిర్వహణకు అయ్యే ఒక రోజు ఖర్చు నిమిత్తం తన నెల జీతం నుంచి రూ.1.50 లక్షలు విరాళంగా అందించినట్టు వెల్లడించారు. ఈ మేరకు చెక్ ను గోశాల ప్రతినిధులకు అందించానని తెలిపారు. ఇవాళ గోశాలను సందర్శించిన హరీశ్ రావు అక్కడున్న గోమాతలకు ఆహారం తినిపించారు. గోశాలలో ఆవులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు.
Harish Rao
Goshala
Donation
Hyderabad
TRS
Telangana

More Telugu News