Asaduddin Owaisi: తమిళనాడులో కాలుమోపేందుకు ఎంఐఎం ప్లాన్.. కమలహాసన్ తో పొత్తుకు అసదుద్దీన్ యత్నాలు

  • క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరించే యత్నంలో ఎంఐఎం
  • తమిళనాడులో బోణీ కొట్టేందుకు ఒవైసీ ప్రయత్నం
  • ఇప్పటికే ముగిసిన ప్రాథమిక చర్చలు
Owaisi to keep alliance with Kamal Haasan Party

హైదరాబాదుకు చెందిన ఎంఐఎం పార్టీ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేస్తూ తన పరిధిని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో సైతం పోటీ చేసి కొన్ని స్థానాలను కైవసం చేసుకుంది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీకి సమాయత్తమవుతోంది.

మరోవైపు తమిళనాడుపై కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కన్నేశారు. మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమలహాసన్ తో చేతులకు కలిపేందుకు ఒవైసీ సిద్ధమవుతున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చాయి. దీనికి సంబంధించి ఒవైసీ అధికారికంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

తమిళనాడులో దాదాపు 25 స్థానాల్లో పోటీ చేయాలని ఒవైసీ భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే తమిళనాడులో ఉన్న పలు ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కూడా యత్నిస్తున్నారు. కమల్ పార్టీతో పాటు, ఇతర చిన్న పార్టీలను కలిపి ఒవైసీ పొత్తు పెట్టుకుంటారని ఎంఐఎం వర్గాలు తెలిపాయి. తమిళనాడులో రాణిపేట్, వేలూరు, కృష్ణగిరి, పుదుకొట్టాయ్, తిరునల్వేలి, తిరుచ్చి, మధురై, రామనాథపురం తదితర ప్రాంతాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

More Telugu News