Sai Pallavi: 'ముద్దు సీను నుంచి అలా బయటపడ్డా'నంటున్న సాయిపల్లవి!

Saipallavi says and thus she escaped from lip lock kiss scene
  • లిప్ లాక్ ముద్దుసీను చేయమన్న దర్శకుడు 
  • తనకిష్టం ఉండదని చెప్పిన సాయిపల్లవి
  • బలవంతపెడితే 'మీటూ' ప్రమాదమన్న హీరో 
  • ప్రయత్నాన్ని విరమించుకున్న దర్శకుడు    
కథానాయికగా సాయిపల్లవికి ఓ ప్రత్యేకత వుంది. అందరిలా గ్లామర్ పాత్రలు చేస్తూ ఎక్స్ పోజ్ చేయదు.. అలాగే అల్లాటప్పా పాత్రలు కూడా చేయదు. తన పాత్రకు సంబంధించి అసభ్యకరమైన సన్నివేశాలు కానీ, డైలాగులు కానీ ఉండకూడదని ముందే చెప్పేస్తుంది. అలా అయితేనే సినిమా ఒప్పుకుంటుంది.

అలాంటి సాయిపల్లవికి ఆమధ్య ఓ సినిమా విషయంలో ఇబ్బంది ఎదురైందట. అదేమిటంటే, హీరోతో లిప్ లాక్ ముద్దు సన్నివేశం చేయాలని, చిత్రకథకు ఆ సన్నివేశం ఎంతో కీలకమని ఆ చిత్ర దర్శకుడు సాయిపల్లవిని బలవంతపెట్టాడట. అలాంటి సన్నివేశాలు చేయడం తనకు ఇష్టం ఉండదనీ, చాలా ఇబ్బంది పడతాననీ ఆమె చెప్పిందట.

ఇక సాయిపల్లవి ఇబ్బందిని గమనించిన సదరు సినిమా హీరో కలుగజేసుకుని, ఆ అమ్మాయిని మీరు ఇలా బలవంతపెడితే 'మీటూ' ఉద్యమంలో ఇరుక్కునే ప్రమాదం ఉందంటూ హెచ్చరించాడట. దాంతో ఆ దర్శకుడు తగ్గాడనీ, ఆ ముద్దు సీనుని విరమించుకున్నాడనీ సాయిపల్లవి తాజాగా చెప్పింది. అలా 'మీటూ' పుణ్యమాని తాను బయటపడ్డానని చెప్పుకొచ్చింది. అయితే, ఏ సినిమా విషయంలో అలా జరిగింది? అన్న విషయాన్ని మాత్రం ఈ ముద్దుగుమ్మ బయటపెట్టలేదు.  
Sai Pallavi
Lip Lock Kiss
Mee Too

More Telugu News