Bandaru Dattatreya: గవర్నర్ దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం

HP Governor Bandaru Dattatreya escapes safely from road accident
  • హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్తుండగా ప్రమాదం
  • స్టీరింగ్ బిగుసుకు పోవడంతో పక్కకు దూసుకుపోయిన కారు
  • చాకచక్యంగా ప్రమాదాన్ని నివారించిన డ్రైవర్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివార్లలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ బిగుసుకుపోవడంతో రోడ్డు పక్కకు కారు దూసుకుపోయింది. అయితే, డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి పెను ప్రమాదం జరగకుండా నివారించగలిగాడు.

ఈ ప్రమాదంలో దత్తాత్రేయతో పాటు మరెవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాసేపటి తర్వాత ఆయన మరో వాహనంలో వెళ్లిపోయారు. కాసేపట్లో ఆయనకు నల్గొండలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్ లో పౌర సన్మానం జరగనుంది.

  • Loading...

More Telugu News