New Delhi: ఢిల్లీ సరిహద్దుల్లో ప్రారంభమైన రైతుల నిరాహార దీక్ష

  • ఉదయం 8 గంటలకు ప్రారంభమైన నిరశన
  • దీక్షలో పాల్గొంటానన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
  • హర్యానా-రాజస్థాన్ సరిహద్దును మూసేసిన పోలీసులు
Farmers starts hunger strike at Delhi border

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు చేస్తున్న ఆందోళన రోజురోజుకు మరింత ఉద్ధృతం అవుతోంది. ఆందోళనలో భాగంగా రైతులు నేడు నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన నిరశన దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ఘజీపూర్ రహదారిపై కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ దీక్షకు కూర్చోగా, హరియాణా సరిహద్దులోని సింఘు, టిక్రీ వద్ద రైతులు పెద్ద ఎత్తున దీక్షలో కూర్చున్నారు. రైతు నాయకుల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఢిల్లీ సహా అన్ని జిల్లా జిల్లా కేంద్రాల్లోనూ రైతులు దీక్షకు దిగారు.

రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానా-రాజస్థాన్ సరిహద్దును పోలీసులు మూసివేశారు. రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా భారీగా బలగాలను మోహరించారు. కాగా, ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా దేశ రాజధానిలో తాను కూడా దీక్షలో పాల్గొననున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

More Telugu News