Nigeria: నైజీరియాలో ఇద్దరు భారతీయుల కిడ్నాప్.. విదేశీయలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం

Two Indians Kidnapped By Gunmen In Nigeria
  • ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న భారతీయులు
  • ఇటీవల విపరీతంగా పెరిగిన కిడ్నాప్‌లు
  • రంగంలోకి పోలీసులు
నైజీరియాలోని ఓ ఔషధ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు. విధులు ముగించుకుని బయటకు వస్తున్న వీరిని సాయుధ ముఠాలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం వేట ప్రారంభించారు.

 నైజీరియాలోని ఫార్మా కంపెనీల్లో వందలాదిమంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం ఇటీవల బాగా పెరిగింది. అయితే, కిడ్నాప్ చేసి తమతో తీసుకెళ్లిన వారికి ఎటువంటి అపాయం తలపెట్టకుండా డబ్బులు అందగానే వారిని సురక్షితంగా వదిలిపెడుతుండడం గమనార్హం. తాజా కిడ్నాప్ నేపథ్యంలో దేశంలోని విదేశీయులందరూ అప్రమత్తంగా ఉండాలని నైజీరియా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
Nigeria
Indians
Kidnap

More Telugu News