Nigeria: నైజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్... రంగంలోకి వాయుసేన, ఆర్మీ!

  • అత్యాధునిక ఆయుధాలతో దాడి
  • పాఠశాలలో చదువుతున్న 600 మంది
  • తీవ్ర ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
400 Students Kidnapped in Nigeria

నైజీరియాలో అత్యాధునిక ఆయుధాలతో వచ్చి, ఓ పాఠశాలపై దాడి చేసిన దుండగులు, అక్కడ చదువుతున్న వారిలో 400 మంది విద్యార్థులను బందీలుగా తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కట్సీనా రాష్ట్రంలో జరిగింది. ఆ పాఠశాలలో దాదాపు 600 మంది వరకూ చదువుతుండగా, దుండగులు దాడి చేసిన తరువాత 400 మంది కనిపించకుండా పోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీస్ విభాగం అధికార ప్రతినిధి గాంబో ఇషా వెల్లడించారు.

ఇక తమ బిడ్డలు కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్ అయిన విద్యార్థుల ఆచూకీని కనుగొనేందుకు నైజీరియా ప్రభుత్వం వైమానిక దళాన్ని, సైన్యాన్ని రంగంలోకి దించింది. పోలీసులు కూడా పెద్దఎత్తున కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు.

More Telugu News