gajendra singh shekhawat: కేసీఆర్ లేఖకు కేంద్రమంత్రి సమాధానం.. కృష్ణా ట్రైబ్యునల్-3 ఏర్పాటుకు అభ్యంతరం లేదన్న మంత్రి

we have no objection on krishna tribunal 3 formation says central govt
  • సుప్రీంలో ఏపీ, తెలంగాణలు వేసిన పిటిషన్లు ఉపసంహరించుకోవాలి
  • ఆ తర్వాతే ట్రైబ్యునల్ ఏర్పాటుపై పరిశీలిస్తాం
  • పోతిరెడ్డిపాడును ఆపమని ఏపీకి చెప్పాం

కృష్ణా ట్రైబ్యునల్-3 ఏర్పాటు విషయంలో కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. అక్టోబరు 2న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాసిన లేఖకు మంత్రి ఇలా బదులిచ్చారు. సుప్రీంకోర్టులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేసిన పిటిషన్లను ఉపసంహరించిన తర్వాత ట్రైబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.

అలాగే అనుమతులు లేకుండా పోతిరెడ్డిపాడును చేపట్టవద్దని ఏపీకి సూచించినట్టు చెప్పారు. కాగా, ఇటీవల రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి ప్రాజెక్టుల విషయమై చర్చించారు. ఈ నేపథ్యంలోనే  కృష్ణా ట్రైబ్యునల్-3 ఏర్పాటుపై మంత్రి ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News