Odisha: ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు బోల్తా.. 20 మంది పరిస్థితి విషమం

private bus coming towards to Hyderabad turned down
  • ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు
  • భారీ మూల మలుపును గుర్తించకపోవడంతో ప్రమాదం
  • 40 మందికి గాయాలు
ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో 40 మంది గాయాలపాలవగా వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒడిశాలోని కోక్‌సొర పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బొడోకెందుగుడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కలహండి జిల్లా ధర్మాఘర్ నుంచి 50 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరిన బస్సు బిజు హైవేపై బొడోకెందుగుడ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఎదురుగా ఉన్న భారీ మలుపును డ్రైవర్ గుర్తించలేకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Odisha
Hyderabad
Private bus
Road Accident

More Telugu News