Indian Navy: భారత నేవీ సిబ్బంది విన్యాసాలు చూస్తే మతిపోతుంది... వీడియో ఇదిగో!

  • క్రమశిక్షణకు మారుపేరుగా త్రివిధ దళాలు
  • నైపుణ్యం పరంగా ప్రపంచంలో ఎవరికీ తీసిపోని వైనం
  • కాగడాలతో గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించిన భారత నేవీ సిబ్బంది
  • పరస్పరం కాగడాలు మార్చుకుంటూ విన్యాసాలు
  • మధ్యలోంచి నడుచుకుంటూ వచ్చిన నేవీ అధికారి
  • వీడియో వైరల్
Amazing guard of honor by Indian Navy personnel

భారత త్రివిధ దళాలను క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటారు. అంతేకాదు, సాహసం, తెగువ, నైపుణ్యం పరంగా మన సైన్యం ఏ దేశానికి చెందిన సైన్యానికీ తీసిపోదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే అందుకు నిదర్శనం. భారత నేవీ సిబ్బంది ఓ పరేడ్ సందర్భంగా అద్భుమైన విన్యాసాన్ని ప్రదర్శించారు. కాగడాలతో వారు ప్రదర్శించిన గార్డ్ ఆఫ్ ఆనర్ విన్యాసం మతిపోయేలా చేస్తుందనడంలో సందేహంలేదు.

చేతుల్లో కాగడాలతో ఎదురెదురుగా నిల్చున్న కొందరు నేవీ సిబ్బంది తమ చేతిలో ఉన్న కాగడాను ఎదుటి వ్యక్తికి విసిరేస్తూ, ఎదుటి వ్యక్తి విసిరిన కాగడాను తాము అందుకుంటూ ప్రతిభను చాటారు. అంతకంటే ముఖ్యంగా, వారు అలా కాగడాలు మార్చుకునే సమయంలో మధ్యలో ఓ అధికారి నడుచుకుంటూ రావడం, అతనికి ఒక్క కాగడా కూడా తగలకపోవడం హైలైట్ అని చెప్పాలి.

More Telugu News