Corona Virus: ఎన్నికల ప్రక్రియను పోలి ఉండేలా టీకా కార్యక్రమం: ఆరోగ్య శాఖ

corana vaccination is resumbles to election program
  • దేశంలో త్వరలోనే అందుబాటులోకి టీకా
  • ఎస్ఓపీలను రూపొందించిన కేంద్రం
  • తొలి విడతలో వందమందికి వ్యాక్సినేషన్
దేశంలో త్వరలోనే కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడంతో పంపిణీపై కొత్త ప్రామాణిక విధానాలను (ఎస్‌ఓపీ) కేంద్ర ఆరోగ్యశాఖ రూపొందించింది. వినియోగదారులకు టీకాను వేగంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు, టీకా కార్యక్రమానికి సంబంధించి అన్ని అంశాలపై ఎస్ఓపీ దిశానిర్దేశం చేస్తుందని ఆరోగ్యశాఖ పేర్కొంది. టీకా కార్యక్రమం ఎన్నికల ప్రక్రియను పోలి వుంటుందని తెలిపింది.

తొలి విడతలో వంద మందికి మాత్రమే వ్యాక్సినేషన్ చేస్తారని, మౌలిక వసతులు మెరుగ్గా ఉంటే ఈ సంఖ్య 200కు కూడా పెరుగుతుందని పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏయే రోజుల్లో చేపట్టాలన్నదానిపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చని వివరించింది.
Corona Virus
Covid vaccine
Health ministry

More Telugu News