భారత్‌ను టార్గెట్ చేసిన మలేసియా ఉగ్రవాదులు.. భగ్నం చేసిన ‘రా’
- మలేసియా కేంద్రంగా భారీ కుట్ర
- మయన్మార్ మహిళకు ఉగ్రవాదుల శిక్షణ
- రాష్ట్రాలను అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు
మయన్మార్‌కు చెందిన ఓ మహిళకు మలేసియా ఉగ్రవాద సంస్థలు శిక్షణ ఇచ్చాయి. భారత్‌లో దాడులు నిర్వహించే గ్రూపునకు ఈమె నాయకత్వం వహిస్తోంది. నేపాల్, లేదంటే బంగ్లాదేశ్ సరిహద్దు గుండా భారత్‌లో ప్రవేశించాలనేది ఉగ్రవాదుల ప్రణాళికగా రా పేర్కొంది. ఢిల్లీ, అయోధ్య, బోధ్ గయ, పశ్చిమ బెంగాల్‌లోని ముఖ్యనగరాలు, శ్రీనగర్‌లు ఉగ్రవాదుల లక్ష్యంగా గుర్తించిన నిఘా వర్గాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశాయి.