Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో శనివారం నాడు 6,351 కేసుల పరిష్కారం!

Above 6 Thousand Cases Settled in Andhrapradesh in single Day
  • 13 జిల్లాల్లోని కోర్టుల్లో లోక్ అదాలత్ లు
  • హైకోర్టులో 262 కేసుల పరిష్కారం
  • సెటిల్ మెంట్ కింద రూ. 33.77 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్ లో శనివారం ఒక్క రోజే అన్ని కోర్టుల్లో ఈ-లోక్ అదాలత్ నిర్వహించగా, మొత్తం 6,351 కేసులు పరిష్కారం అయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు 13 జిల్లాల్లోని కోర్టులన్నీ 322 లోక్ అదాలత్ బెంచ్ లను నిర్వహించాయి. వివిధ కేసుల్లో సెటిల్ మెంట్ కింద రూ. 33.77 కోట్ల చెల్లింపులు జరిగాయని న్యాయ సేవాధికార సంస్థ సభ కార్యదర్శి వెల్లడించారు.

ఇక హైకోర్టులో 262 కేసులు పరిష్కారం కాగా, వీటిని న్యాయమూర్తులు చాగరి ప్రవీణ్ కుమార్, ఆకుల వెంకట శేషసాయి, నైనాల జయసూర్య బెంచ్ లు విచారించాయి. మొత్తం 368 కేసులను టేబుల్ పైకి తీసుకుని, 262 కేసులను పరిష్కరించాయి.

Andhra Pradesh
Lok Adalat
Cases

More Telugu News