Karti Chidambaram: కార్తీ చిదంబరంకు ఊరటనిచ్చిన మద్రాస్ హైకోర్టు

HC quashes Income Tax proceedings against Karti Chidambaram
  • రూ. 7 కోట్లకు లెక్క చెప్పలేదంటూ కేసు నమోదు
  • ఇప్పటికిప్పుడే చర్యలు అవసరం లేదన్న హైకోర్టు
  • అవసరమైతే ప్రొసీడింగ్స్ మళ్లీ ప్రారంభించవచ్చని సూచన
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు మద్రాస్ హైకోర్టు ఊరటనిచ్చింది. ఆదాయపు పన్ను చెల్లింపుకు సంబంధించి కార్తీ చిదంబరం, ఆయన భార్యపై ప్రారంభించిన ప్రొసీడింగ్స్ ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒక ఆస్తి అమ్మకానికి సంబంధించి రూ. 7 కోట్లకు లెక్కలు చెప్పలేదంటూ ఐటీ శాఖ వీరిపై కేసు నమోదు చేసింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, ఇప్పటికిప్పుడే దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. సరైన సమీక్ష తర్వాత అవసరమనుకుంటే ప్రొసీడింగ్స్ ను మళ్లీ ప్రారంభించవచ్చని సూచించింది.

ముత్తుకాడులో ఉన్న తమ సొంత స్థలాన్ని అమ్మడం ద్వారా వీరికి రూ. 6.38 కోట్లు వచ్చాయి. ఇందులో రూ. 1.35 కోట్లు నగదు రూపంలో వచ్చింది. అయితే, దీనికి సంబంధించి వారు పన్ను చెల్లించడం కానీ, లేదా అసెస్ మెంట్ లో పేర్కొనడం కానీ చేయలేదని కేసు నమోదైంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో కార్తీ దంపతులకు హైకోర్టు ఊరటనిచ్చింది.
Karti Chidambaram
IT
Madras HC

More Telugu News