పొన్నకల్లు ఆంజనేయస్వామి విగ్రహాన్ని పెకలించడం గర్హనీయం: చంద్రబాబు

12-12-2020 Sat 16:46
  • దేవాలయాలపై దాడులకు చంద్రబాబు ఖండన
  • ఇవాళ కూడా దాడి జరిగిందని వెల్లడి
  • ప్రభుత్వ, పోలీసుల ఉదాసీనత వల్లే దాడులని వ్యాఖ్యలు
  • ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్
  • దేవాలయాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని డిమాండ్
Chandrababu condemns attack on temples and idols in state
ఏపీలో దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలను ఖండిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఇవాళ కూడా కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయస్వామి విగ్రహాన్ని పెకలించడం గర్హనీయం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, పోలీసుల ఉదాసీనత వల్లే ఇలాంటి నేరాలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని విమర్శించారు. మొదట్లోనే ఈ అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తే ఈ విధ్వంసకాండకు అడ్డుకట్ట పడేదని స్పష్టం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దురాగతాలు పునరావృతం కాకుండా చూడాలని, దేవాలయాలు, దేవతా విగ్రహాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.