Suresh: టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు సోదరుడు అనారోగ్యంతో మృతి

Tollywood producer Bunny Vasu brother dies of illness
  • బన్నీ వాసు కుటుంబంలో తీవ్ర విషాదం
  • అనారోగ్యంతో బాధపడుతున్న బన్నీ వాసు అన్నయ్య సురేశ్
  • రెండు కిడ్నీలు విఫలం
  • బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • గత రాత్రి ఆసుపత్రిలోనే కన్నుమూత
ప్రముఖ నిర్మాత బన్నీ వాసు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. బన్నీ వాసు అన్నయ్య సురేశ్ తీవ్ర అనారోగ్యంతో మరణించారు. సురేశ్ కు రెండు కిడ్నీలు వైఫల్యం చెందడంతో కొంతకాలంగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గత రాత్రి ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. సురేశ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. వాహనాలకు సంబంధించిన సీఎన్జీ కన్వెర్షన్ కిట్ తయారీ రంగంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. సురేశ్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. సురేశ్ కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
Suresh
Death
Bunny Vasu
Tollywood

More Telugu News