America: మోడెర్నాతో అమెరికా మరో ఒప్పందం.. అదనంగా 100 మిలియన్ డోసుల కరోనా టీకా కొనుగోలు!

America buying another 100 million vaccine doses of moderna
  • తొలుత 100 మిలియన్ డోసుల కొనుగోలుకు ఒప్పందం
  • తాజాగా మరో 100 మిలియన్ డోసులు కొనుగోలు
  • వచ్చే ఏడాది రెండో త్రైమాసికానికి మొత్తం డోసుల సరఫరా
కరోనా టీకా అభివృద్ధి చేసిన మోడెర్నాతో అమెరికా మరో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి 100 మిలియన్ల కరోనా టీకా డోసుల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా.. ఈసారి అదనంగా మరో 100 మిలియన్ డోసులు కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించింది.

ఫైజర్ నుంచి అదనపు డోసుల్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని  కోల్పోయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మోడెర్నాతో తాజా ఒప్పందం అమెరికా ప్రజలకు పెద్ద ఊరట కలిగించే విషయమే. తాజా ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది రెండో త్రైమాసికం నాటికి అవసరమైన డోసులను అందించనున్నట్టు మోడెర్నా ప్రకటించింది. అయితే, అంతకుముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం తొలి త్రైమాసికంలోనే తొలి విడత డోసుల్ని అందించనున్నట్టు తెలిపింది.
America
Pfizer
Moderna
covid vaccine

More Telugu News