Rajinikanth: నేడు రజనీకాంత్ బర్త్ డే.. పార్టీ పనుల్లో బిజీబిజీ!

Tamil Super Star Rajinikanth registered his party name at EC
  • ఈ నెల 31న పార్టీ పేరును ప్రకటించే అవకాశం
  • ఈసీ వద్ద మూడు పేర్లు నమోదు!
  • బర్త్ డే ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన అభిమానులు
రాజకీయాల్లోకి రావడం పక్కా అని తేల్చేసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. చెన్నైలోని తన నివాసంలో నిన్న మక్కల్ మండ్రం  నిర్వాహకులతో సమాలోచనలు జరిపారు. మరోవైపు, నిన్న ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పార్టీ పేరును మక్కల్ మండ్రం నేతలు రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రజనీ తన పార్టీ పేరు, చిహ్నంపై ఓ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. మొత్తం మూడు పేర్లను ఈసీ వద్ద నమోదు చేశారని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ నెల 31న పార్టీ పేరును రజనీ అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.

రజనీకాంత్ నేడు 71వ జన్మదినోత్సవం జరుపుకోబోతున్నారు. రాజకీయాల్లోకి రానున్న తరుణంలో ఈ బర్త్‌డే ఆయనకు ప్రత్యేకంగా మారనుంది. బర్త్‌డేను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు రెడీ అయ్యారు. ఎన్నూరులోని శ్రీ అంకాళ పరమేశ్వరి ఆలయంలో నిన్న మక్కల్ మండ్రం నేతలు ప్రత్యేక యాగం నిర్వహించారు. వెస్ట్ మాంబళంలోని శంకరమఠంలో గోపూజ, అశోక్‌నగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
Rajinikanth
Tamil Nadu
makkal mandram
EC
political party
Birthday

More Telugu News