PSLV -C50: 17న నింగిలోకి కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-01: ఇస్రో

  • 17న మధ్యాహ్నం 3.41 గంటలకు ప్రయోగం
  • అండమాన్, నికోబార్, లక్షద్వీప్‌లకు విస్తరించనున్న పరిమితి
  • అందుబాటులోకి సి బ్యాండ్ సేవలు
PSLV 50 is scheduled to launch CMS 01 on 17th

భారతదేశపు 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన సీఎంఎస్-01ను ఈ నెల 17న నింగిలోకి పంపనున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ-సి50 ద్వారా దీనిని ప్రయోగించనున్నారు. 17న మధ్యాహ్నం 3.41 గంటలకు ప్రయోగం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

ఫ్రీక్వెన్సీ స్ప్రెక్టంలో విస్తరించిన సి బ్యాండ్ సేవలను అందించేందుకే ఈ ప్రయోగం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లకు కూడా దీని పరిమితి విస్తరించనుంది. ఇది షార్ నుంచి జరుగుతున్న 77వ ప్రయోగం కావడం గమనార్హం.

More Telugu News