Reception: హైదరాబాదులో ఘనంగా నిహారిక, చైతన్య పెళ్లి రిసెప్షన్... వీడియో ఇదిగో!

Niharika and Chaitanya wedding reception held in Hyderabad
  • ఈ నెల 9న ఘనంగా నిహారిక, చైతన్యల వివాహం
  • రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వేడుకగా జరిగిన పెళ్లి
  • హాజరైన మెగా కుటుంబ సభ్యులు
  • నేడు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో విందు
  • సందడి చేసిన చిరు, రామ్ చరణ్ తదితరులు
మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల వివాహం ఈ నెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వేడుకగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ శుభకార్యానికి మెగా కుటుంబాలన్నీ హాజరయ్యాయి. ఈ పెళ్లి రిసెప్షన్ కార్యక్రమాన్ని ఇవాళ హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ విందు కార్యక్రమం నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది.

కాగా, ఈ రిసెప్షన్ కు వచ్చే అతిథులు లోపలికి ప్రవేశించాలంటే ఓ పాస్ వర్డ్ తప్పనిసరి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక, ఈ విందు కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తదితరులు విచ్చేశారు. అటు, చైతన్య తండ్రి, గుంటూరు రేంజి మాజీ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు వర్గం కూడా భారీగానే హాజరైనట్టు తెలుస్తోంది.
Reception
Niharika
Chaitanya Jonnalagadda
Wedding
Hyderabad

More Telugu News