Budda Venkanna: కుంభకోణాల గురించి నువ్వు చెప్పాలి, ఏపీ ప్రజలు వినాలి: విజయసాయిరెడ్డిపై బుద్ధా వ్యాఖ్యలు

Budda Venkanna once again slams Vijayasai Reddy
  • అమరావతి గురించి 18 నెలలుగా ఆలోచిస్తున్నారని వెల్లడి
  • నీకు, నీ అల్లుడికి బట్టతల తప్ప ఏమొచ్చిందని ఎద్దేవా
  • ఒక్క రూపాయి అవినీతి చూపించలేకపోయారని వ్యాఖ్యలు
  • నిర్మాణ ఖర్చులు మీకేం తెలుస్తాయంటూ ట్వీట్
  • ఏనాడైనా కడితే కదా తెలిసేదంటూ వ్యంగ్యం
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ధ్వజమెత్తారు. అమరావతి గురించి 18 నెలలుగా ఆలోచించి నీకు, నీ అల్లుడికి బట్టతల రావడం తప్ప ఒక్క రూపాయి అవినీతి చూపించలేక చతికిలబడ్డారు అంటూ విమర్శించారు. కుంభకోణాల గురించి నువ్వు చెప్పాలి, ఏపీ ప్రజలు వినాలి అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

మధ్యతరగతి ప్రజలే చదరపు అడుగుకు రూ.1,500 వరకు ఖర్చుచేస్తుంటే, సచివాలయ నిర్మాణానికి 11 మీటర్ల కాలమ్స్, దానికి సరిపడా బీములు, ఫాల్స్ సీలింగ్... అన్నీ కలిపి ఆమాత్రం ఖర్చవడంలో ఆశ్చర్యం ఏముంది విజయసాయిరెడ్డీ అంటూ ట్విట్టర్ లో స్పందించారు. అయినా మీరు ఏనాడైనా కడితే కదా మీకు తెలిసేది? మీకు నచ్చితే కబ్జా చేయడం, నచ్చకపోతే కూల్చేయడం తెలిసిన మీకు నిర్మాణ ఖర్చులు ఏమి తెలుస్తాయిలే! అంటూ ఎద్దేవా చేశారు.
Budda Venkanna
Vijayasai Reddy
Amaravati
Andhra Pradesh

More Telugu News