Rohit Sharma: ఫిట్ నెస్ టెస్టు పాసైన రోహిత్ శర్మ... ఆస్ట్రేలియా పర్యటనకు తొలగిన అడ్డంకి

  • ఐపీఎల్ లో గాయపడిన రోహిత్ శర్మ
  • రోహిత్ శర్మ లేకుండానే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా
  • జాతీయ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి కోలుకున్న రోహిత్
  • ద్రావిడ్ పర్యవేక్షణలో ఫిట్ నెస్ టెస్టు
  • ఆసీస్ తో చివరి రెండు టెస్టులకు అందుబాటులోకి రోహిత్
Rohit Sharma passed fitness test and set to fly Australia

టీమిండియా డాషింగ్ క్రికెటర్ రోహిత్ శర్మ ఇటీవల ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డాడు. దాంతో ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మను ఎంపికచేయలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందాడు. తాజాగా గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మకు ఫిట్ నెస్ టెస్టు నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో ఈ టెస్టు చేపట్టారు. ఈ పరీక్షలో రోహిత్ తన ఫిట్ నెస్ నిరూపించుకున్నాడు. దాంతో ఆస్ట్రేలియా వెళ్లేందుకు అడ్డంకి తొలగిపోయింది.

అయితే, ఆస్ట్రేలియాలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని క్వారంటైన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. దాంతో రోహిత్ నాలుగు టెస్టుల సిరీస్ లో చివరి రెండు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. డిసెంబరు 14న ఆస్ట్రేలియా పయనం కానున్న రోహిత్ కచ్చితంగా రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉండకతప్పదు. టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ డిసెంబరు 17న ప్రారంభం కానుంది. మూడో టెస్టు జనవరి 7 నుంచి షురూ కానుండగా, అప్పటికి రోహిత్ శర్మ క్వారంటైన్ కూడా పూర్తవుతుంది.

More Telugu News