ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్

11-12-2020 Fri 13:36
  • హైదరాబాదులో గోరటి కుమార్తె వివాహం
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్
  • కేసీఆర్ రాకతో పెళ్లిలో మరింత పెరిగిన సందడి
  • గోరటి కుమార్తె వివాహానికి విచ్చేసిన కేటీఆర్, కవిత
  • తెలంగాణ మంత్రులు కూడా రాక
CM KCR attends to Goreti Venkanna daughter wedding
ప్రజాగాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహం ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఈ వివాహానికి సీఎం కేసీఆర్ విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. కేసీఆర్ రాకతో పెళ్లివేడుకలో మరింత సందడి పెరిగింది. కాగా, ఈ పెళ్లికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా వచ్చారు. ఇతర మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి తదితరులు విచ్చేశారు. గోరటి మిత్రుడు, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి సైతం పెళ్లిలో కనిపించారు.

ప్రజాగాయకుడు గోరటి వెంకన్నకు ఇటీవలే సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. గవర్నర్ కోటాలో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు.