Dame Barbara: అలనాటి అందాల బ్రిటిష్ సినీ నటి డేమ్ బార్బారా ఇకలేరు!

Britain Actress Dame Barbara Passes Away
  • 1954 నుంచి నటిస్తున్న డేమ్ బార్బారా విండ్సర్
  • గత నాలుగేళ్లుగా అల్జీమర్స్ వ్యాధి
  • కన్నుమూశారని తెలిపిన భర్త స్కాట్ మిచెల్
1954లో, తన 17 సంవత్సరాల వయసులోనే ఆంగ్ల చిత్రాల్లో నటించడం ప్రారంభించి, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అందాల నటి డేమ్ బార్బారా విండ్సర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె భర్త స్కాట్ మిచెల్ వెల్లడించారు.  ప్రస్తుతం ఆమె వయసు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆమె, లండన్ కేర్ హోమ్ లో ఉంటున్నారు. దాదాపు 62 సంవత్సరాల పాటు సినీ, కళా రంగాలకు సేవలందించిన ఆమె, 2016లో చివరి సారిగా నటించారు.

ఆమె నటించిన 'ఈస్ట్ ఎండర్స్', 'ది క్యారీ ఆన్' కామెడీ సిరీస్ చిత్రాలు అభిమానులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా 'ది క్యారీ ఆన్' సిరీస్ లో 31 చిత్రాలు రాగా, 9 చిత్రాల్లో ఆమె నటించారు. అల్జీమర్స్ సొసైటీకి ప్రచారకర్తగానూ ఉన్న ఆమె, గతంలో ప్రధాని బోరిస్ జాన్సన్ ను కలిసి, ప్రజల్లో వ్యాధిపై అవగాహన పెంచే కార్యక్రమాలనూ నిర్వహించాలని కోరారు. డేమ్ బార్బారా మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపాన్ని వెలిబుచ్చారు.
Dame Barbara
Passes Away
Britain
Actress

More Telugu News