hospitals: దేశ వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు బంద్.. నిలిచిన సాధారణ సేవలు!

  • ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్
  • ఆ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్
  • అత్యవసర, కరోనా చికిత్సలు మినహా అన్ని సేవలు బంద్
  • బంద్‌కు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం మద్దతు
hospitals bundh in india

ఆయుర్వేద వైద్యంలో పీజీ పూర్తి చేసిన వారు  58 రకాల శస్త్రచికిత్సలు చేసేందుకు వీలు కల్పిస్తూ సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ మెడిసిన్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ  ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఈ రోజు ప్రైవేటు ఆసుపత్రుల బంద్‌కు పిలుపునిచ్చింది.

దీంతో దేశ వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర, కరోనా చికిత్సలు మినహా అన్ని సేవలు బంద్ అయ్యాయి. ఈ బంద్‌కు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం కూడా మద్దతు తెలిపింది. దేశంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు అన్ని సాధారణ సేవలను నిలిపివేశారు.

ఆయుర్వేద వైద్యంలో పీజీ పూర్తి చేసిన వారికి శస్త్రచికిత్సలకు అనుమతి ఇస్తే   వైద్యరంగంలో నకిలీ వైద్యులు పుట్టుకొస్తారని వైద్యులు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, వారి డబ్బు వృథా అవుతుందని అంటున్నారు.

More Telugu News