Tirumala: 2 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం... టికెట్లు విడుదల చేసిన టీటీడీ!

Online Tickets Released for Vaikuntha Ekadasi in Tirumala
  • డిసెంబర్ 25న వైకుంఠ ఏకాదశి
  • రోజుకు 20 వేల మందికి దర్శనం
  • 10 రోజులు తెరచుకోనున్న వైకుంఠ ద్వారాలు
ఈ నెల చివరి వారంలో రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 2 లక్షల మంది భక్తులకు ఆన్ లైన్ టికెట్లను విక్రయించడం ద్వారా, పది రోజుల వ్యవధిలో వారందరికీ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందుకోసం ఆన్ లైన్ లో రోజుకు 20 వేల టికెట్లను విడుదల చేసింది.

రోజుకు 20 వేల టికెట్లను భక్తులకు విక్రయిస్తామని, ఆగమ శాస్త్ర నిపుణుల సలహాలు తీసుకున్న మీదటే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరచివుంచాలన్న నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. నేటి నుంచి ఆన్ లైన్ లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా, ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 25వ తేదీన రానుంది.
Tirumala
Tirupati
TTD
Vaikuntha Ekadasi
Tickets
Online

More Telugu News