Dundigal: దుండిగల్ లోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో భారీ అగ్నిప్రమాదం

huge fire accident in Ganapathi Sachidananda Ashramam
  • షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎగసిపడిన మంటలు 
  • ఆశ్రమంలోని రెండు ఆలయాలకు మంటలు
  • కాలి బూడిదైన భారీ షెడ్డు.. భారీ ఆస్తినష్టం
హైదరాబాద్ శివారులోని దుండిగల్‌లో ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం కారణంగా ఆశ్రమ ఆవరణలో వేసిన భారీ షెడ్డు కాలి బూడిదైంది. ఆశ్రమంలోని రెండు ఆలయాలకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఆశ్రమానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో భారీ ఆస్తినష్టం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Dundigal
Ganapathi Sachidananda Ashramam
Telangana
Fire Accident

More Telugu News