Mukhesh Ambani: తాత అయిన ముఖేశ్ అంబానీ

Mukhesh Ambani becomes grand father
  • మగబిడ్డకు జన్మనిచ్చిన ఆకాశ్ అంబానీ భార్య
  • ప్రకటన ద్వారా వెల్లడించిన అంబానీ కుటుంబం
  • తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడి
మన దేశంలో అత్యంత శ్రీమంతుడైన ముఖేశ్ అంబానీ తాత అయ్యారు. ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ భార్య శ్లోక పండంటి కుమారుడికి జన్మనిచ్చారు. ఈ సందర్భంగా అంబానీ కుటుంబ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చిన సందర్భంగా నీతా, ముఖేశ్ అంబానీలు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు.

శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో శ్లోక, ఆకాశ్ తల్లిదండ్రులయ్యారని... ముంబైలో శ్లోక మగబిడ్డకు జన్మనిచ్చిందని అంబానీ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొంది. అంబానీ, మెహతా కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయని తెలిపింది.

అంబానీ దంపతుల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ అనే విషయం తెలిసిందే. ఆకాశ్ భార్య శ్లోక మెహతా వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా, మోనా దంపతుల కుమార్తె. ఆకాశ్, శ్లోకలు ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు. మరోవైపు తాత అయిన సందర్భంగా ముఖేశ్ అంబానీకి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Mukhesh Ambani
Grand Father
Reliance

More Telugu News