Jagan: 'జగనన్న జీవ క్రాంతి' ప్రారంభం... గొర్రెపిల్ల, కంబళితో సీఎం

  • మహిళల స్వావలంబనే లక్ష్యంగా 'జగనన్న జీవ క్రాంతి'
  • క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన సీఎం
  • రూ.1,869 కోట్లతో 2.49 లక్షల మేకలు, గొర్రెలు పంపిణీ
  • ఇప్పటికే గేదెలు, ఆవుల పంపిణీ
  • కరవు వచ్చినా జీవాలు రైతులకు ఆదరవుగా ఉంటాయన్న సీఎం
CM Jagan launches Jagananna Jeeva Kranthi

మహిళల స్వయంసమృద్ధే లక్ష్యంగా తీసుకువచ్చిన 'జగనన్న జీవ క్రాంతి' పథకానికి ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రారంభోత్సవం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేతిలో గొర్రె పిల్లను ఎత్తుకుని, భుజంపై కంబళి వేసుకుని, తాటాకుల గొడుగు పట్టుకుని అలరించారు.

కాగా, 'జగనన్న జీవ క్రాంతి' పథకంలో భాగంగా రాష్ట్రంలో 2.49 లక్షల మేకలు, గొర్రెలు పంపిణీ చేయనున్నారు. ఈ పథకానికి రూ.1,869 కోట్ల వ్యయం కానుంది. ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ, వ్యవసాయం మాత్రమే కాకుండా మేకలు, గొర్రెలు, పశువులు, చేపలు, కోళ్ల పెంపకం కూడా చేపడితే రైతుల కుటుంబాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయని అభిప్రాయపడ్డారు.

కరవు కాటకాలు వచ్చి వ్యవసాయంలో నష్టం వచ్చినా, ఈ జీవాలు రైతులకు ఆదరవుగా ఉంటాయని వివరించారు. ఇప్పటికే ఆవులు, గేదెల పంపిణీ ప్రారంభించామని, అందుకోసం రూ.3,500 కోట్లు వెచ్చిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వాలు ఏనాడూ వ్యవసాయ అనుబంధ రంగాలను పట్టించుకోలేదని ఆరోపించారు.


.

More Telugu News