Sensex: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ స్టాకులకు అమ్మకాల ఒత్తిడి
  • 143 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 50 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Sensex closes 143 points low

దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీకి ఈరోజు బ్రేక్ పడింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 45,959కి పడిపోయింది. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 13,478 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (4.17), ఐటీసీ (3.77), హిందుస్థాన్ యూనిలీవర్ (2.49), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.13), టాటా స్టీల్ (0.65).

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-3.27%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.43%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.34%), యాక్సిస్ బ్యాంక్ (-1.32%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.30%).

More Telugu News