Nani: నాని హీరోగా 'శ్యామ్ సింగరాయ్' ప్రారంభం... క్లాప్ కొట్టిన తండ్రి

  • రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని సినిమా
  • ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టిన గంటా రాంబాబు
  • తండ్రి కాళ్లకు నమస్కరించిన నాని 
  • మిక్కీ జే మేయర్ స్వరాలు
Nani new movie Shyam Singharay starts in Hyderabad

నాని, సాయిపల్లవి, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నేడు హైదరాబాదులో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కాగా, ముహూర్తం షాట్ కు నాని తండ్రి గంటా రాంబాబు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా నాని తన తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. నిహారిక ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఇకపై ఈ చిత్రం రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోనుంది. పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

More Telugu News