Farmers Protest: మీ వద్ద ఆ సమాచారం ఉన్నట్టయితే వెంటనే సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి: కేంద్రానికి శివసేన సలహా

Conduct surgical strikes on Pak and China says Shivsena
  • రైతుల ఆందోళన వెనుక చైనా, పాక్ ఉందన్న కేంద్ర మంత్రి
  • ఇది చాలా సీరియస్ విషయమన్న సంజయ్ రౌత్
  • రాష్ట్రపతి, ప్రధాని చర్చించాలని వ్యాఖ్య
రైతుల నిరసన కార్యక్రమాల వెనుక పాకిస్థాన్, చైనాల హస్తం ఉందని కేంద్ర మంత్రి రావ్ సాహెబ్ దాన్వే వ్యాఖ్యానించారు. ఆందోళనల్లో పాల్గొంటున్న వారు రైతులు కాదని చెప్పారు. ఎన్నార్సీ, సీఏఏ ల విషయంలో కూడా ముస్లింలను రెచ్చగొట్టారని... ఆరు నెలల్లో ముస్లింలు భారత్ వదిలి వెళ్లే పరిస్థితి ఉంటుందని రెచ్చగొట్టారని... ఇప్పటి వరకు ఒక ముస్లిం అయినా దేశం విడిచి వెళ్లారా? అని ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ... అదే నిజమైతే చైనా, పాకిస్థాన్ లపై వెంటనే సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని అన్నారు. రైతుల ఆందోళనల వెనుక ఆ దేశాల హస్తం ఉందనే సమాచారం ఉన్నట్టైతే... ఆ దేశాలపై రక్షణ మంత్రి వెంటనే సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన విషయమని... రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, త్రివిధ దళాల అధిపతులు వెంటనే దీనిపై చర్చించాలని అన్నారు.
Farmers Protest
Pakistan
China
Surgical Strikes

More Telugu News