India: కొత్త పార్లమెంటు భవనానికి భూమిపూజ చేసిన ప్రధాని మోదీ

  • వేదమంత్రోచ్చారణ మధ్య భూమి పూజ కార్యక్రమం
  • కార్యక్రమానికి హాజరైన పలువురు కేంద్ర మంత్రులు
  • 64,500 చదరపు మీటర్ల వైశాల్యంలో పార్లమెంటు భవనం
PM Modi performs ground breaking ceremony for new Parliamet building

ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో నూతన పార్లమెంటు భవన సముదాయానికి ప్రధాని మోదీ భూమిపూజను నిర్వహించారు. వేద పండితులు వేదమంత్రోచ్చారణ చేస్తుండగా ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో పాలు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

త్రిభుజాకారంలో నిర్మించనున్న ఈ భవనంలో ఐదు ఫ్లోర్లు ఉంటాయి. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ. 971కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. లోక్ సభకు ఆనుకుని ప్రధాని కార్యాలయం ఉంటుంది. 2022 ఆగస్టు నాటికి ఈ భవనం పూర్తి కానుంది. వందేళ్ల అవసరాలకు సరిపడేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.

More Telugu News