Renu Desai: నిహారిక పెళ్లి రోజున... తన పెళ్లి బ్రేకప్ పై రేణు దేశాయ్ వ్యాఖ్యల వీడియో!

Renu Desai Comments Video on Niharika Marriage Date
  • వివాహం విఫలమైతే ఇద్దరిదీ బాధ్యతే
  • కొత్త ఇంట్లో అడుగు పెడితే చీకటిగా అనిపిస్తుంది
  • మానసిక ధైర్యంతో బయటకు రావాల్సి వుంటుంది
  • వివాహం బ్రేకప్ కు కర్మ కూడా కారణమేనన్న రేణు
ఏదైనా ఒక వివాహ బంధం విఫలం అయిందంటే, ఇద్దరి మధ్య అవగాహన లేకపోవడమేనని పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు రేణు ఓ వీడియోను విడుదల చేశారు. తమ వివాహం విఫలం కావడంపై ఆమె గతంలోనూ చాలా సార్లు స్పందించినా, సరిగ్గా మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె వివాహం జరుగుతున్న రోజునే ఈ వీడియోను ఆమె విడుదల చేయడంతో వైరల్ అయింది. కాబోయే జీవిత భాగస్వామితో రిలేషన్ షిప్ ను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంటుందని చెప్పుకొచ్చారు.

చాలా సార్లు చాలా మంది తమ భర్త మంచిగా లేరని తెలిసి కూడా అతనితో మంచిగా ఉండేందుకే ప్రయత్నిస్తారని చెప్పిన రేణూ దేశాయ్, అది భారతీయ మహిళలకు  అలవాటై పోయిందని వ్యాఖ్యానించారు. ఏ వివాహమైనా బ్రేకప్ అయిందంటే, దానికి ఏదో ఒక కారణం ఉంటుందని, దాన్ని కర్మ అని కూడా అనుకోవచ్చని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ముందడుగు వేయాలని అన్నారు.

తాను ఈ అడుగులన్నీ వేసుకుంటూనే వచ్చానని, అందరి ఆశీర్వాదంతో కొత్త జంట జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నానని ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండానే నిహారిక, చైతన్య దంపతులకు తన విషెస్ అందించారు. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వేళ ఎంతో చీకటిగా అనిపిస్తుందని, కానీ ఆ చీకటి నుంచి మానసిక దృఢత్వం, స్వయంకృషితోనే బయటకు రావాలని అభిలషించారు. ఎవరో వచ్చి సాయం చేస్తారని అనుకోవద్దని, వారు సాయం చేసినా, ఎవరికి వారే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగి వుండాలని సూచించారు. రేణు దేశాయ్ వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు.

Renu Desai
Niharika
Marriage
Break up

More Telugu News