Sonu Sood: ప్రజలకు సాయం చేయడానికి ఆస్తులు తాకట్టు పెట్టిన సోను సూద్

Sonu sood mortgates his Mumbai properties
  • లాక్ డౌన్ సమయంలో ఎంతో సేవ చేసిన సోను సూద్
  • ముంబైలోని ఎనిమిది ఆస్తుల తాకట్టు
  • తాకట్టు పెట్టి రూ. 10 కోట్లు సేకరించిన వైనం
సినీ నటుడు సోను సూద్ నిజ జీవితంలో ఎంతో మంది అపన్నులకు ఆపద్బాంధవుడిగా నిలిచారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను ఆయన చేశారు. వలస కార్మికులను వారి ఊళ్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.

మరోపక్క విదేశాలలో చిక్కుకుపోయిన వారికి విమానాలను కూడా ఏర్పాటు చేశారు. పలువురికి విద్య, వైద్య ఖర్చులు భరించారు. ఎవరు ఏ సాయం అడిగినా కాదనకుండా తన వంతు సహాయం చేసేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ, స్టార్ హీరోలుగా వెలిగిపోయేవారు కూడా చేయలేని పనులను సోను చేశారు.

ఈ నేపథ్యంలో, సోనూకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలియని విషయం ఏమిటంటే... ప్రజలకు సాయం చేయడం కోసం సోను తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టారు.

రూ. 10 కోట్లను పోగు చేయడం కోసం ముంబైలో తనకు గల ఎనిమిది ఆస్తులను ఆయన తాకట్టు పెట్టారు. ఇందులో ఆరు ఫ్లాట్లు, రెండు దుకాణాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వెస్ట్ ఇండియా రెసిడెన్సియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ మరియు హెడ్ రితేశ్ మెహతా మాట్లాడుతూ, ఎదుటి వారి కోసం ఇంత గొప్ప పని చేసిన వారిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు.
Sonu Sood
Tollywood
Bollywood

More Telugu News