Niharika Konidela: సంగీత్ వేడుకల్లో స్టెప్పులు వేసిన చిరంజీవి దంపతులు

Chiranjeevi and his wife dances in Niharikas Sangeet function
  • మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి
  • ఉదయ్ పూర్ కు చేరుకున్న మొత్తం కుటుంబం
  • సందడిగా జరుగుతున్న పెళ్లి వేడుక
సినీ నటుడు నాగబాబు ఏకైక తనయ నిహారిక కొణిదెల వివాహ వేడుకలు ఉదయ్ పూర్ లో ఘనంగా జరుగుతున్నాయి. నిహారిక పెళ్లి రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు తనయుడితో జరుగుతున్న సంగతి తెలిసిందే. సంగీత్ వేడుకల సందర్భంగా మెగా ఫ్యామిలీకి చెందిన అందరూ సందడి చేశారు.

ఇక ఈ వేడుకల్లో చిరంజీవి, ఆయన భార్య సురేఖ దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సూపర్ హిట్ సాంగ్ 'బంగారు కోడిపెట్ట' పాటకు చిరు దంపతులు చేసిన డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది. అంతేకాదు... అల్లు అరవింద్ దంపతులు కూడా 'రామ్మా చిలకమ్మా' అనే పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. మరోవైపు 'గ్యాంగ్ లీడర్' పాటకు నాగబాబు, చైతన్య, నిహారిక డ్యాన్ చేశారు.
Niharika Konidela
Marriage
Tollywood
Chiranjeevi

More Telugu News