‘సిల్క్ స్మిత బయోపిక్’ వార్తలపై స్పందించిన అనసూయ
- తన కొత్త సినిమా లుక్ ను ఇటీవల పోస్ట్ చేసిన అను
- తమిళ సినిమాలో నటిస్తోన్న అనసూయ
- సిల్క్ స్మిత పాత్రలో నటించడం లేదని క్లారిటీ
హీరో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవల అనసూయ ఫొటో పోస్ట్ చేసింది. ‘మరో మంచి కథలో జీవిస్తున్నాను. కొత్త ప్రయాణం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అనసూయ పేర్కొంది. తన ఈ కొత్త లుక్‌కు సిల్క్ స్మిత రిఫరెన్స్ అని చెప్పింది.
అంతేగాక, లిప్ స్టిక్ పెదాలు, చేతులకి గాజులు, చీరకట్టుతో అద్దంలో తన ముఖం కనపడేట్లు ఆమె మరో ఫొటో పోస్ట్ చేసింది. ఈ రోజు మరో ఫొటో పోస్ట్ చేసి, మరింత ఆసక్తిని రేపింది. ఇదే సమయంలో సిల్క్ స్మిత బయోపిక్ రూపొందుతోందని ప్రచారం జరుగుతుండడం, ఇదే సమయంలో అచ్చం ఆమెలా తయారై అనసూయ పోస్టు చేయడంతో ఆ పాత్రలో అనసూయే నటిస్తోందని వార్తలు వచ్చాయి.
దీంతో తాజాగా ఆమె స్పందించింది. ‘నేను ఏ బయోపిక్‌లోనూ సిల్క్ స్మిత గారి పాత్రలో నటించడం లేదు’ అని ఆమె స్పష్టం చేసింది.