Balakrishna: సి.కల్యాణ్ బ్యానర్లో బాలకృష్ణ మరో సినిమా!

  Balakrishna to do a movie in Kalyans banner
  • గతంలో బాలయ్యతో సి.కల్యాణ్ మూడు సినిమాలు 
  • బాలయ్యతో చాలా కంఫర్ట్ అంటున్న నిర్మాత
  • రానాతో నిర్మించిన '1945 లవ్ స్టోరీ' త్వరలో విడుదల
  • సత్యదేవ్, కేఎస్ రవికుమార్ లతో త్వరలో చిత్రాలు      
గతంలో బాలకృష్ణ హీరోగా 'పరమవీర చక్ర', 'జై సింహా', 'రూలర్' వంటి భారీ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ బాలయ్యతో మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆయనే వెల్లడించారు.

'బాలకృష్ణగారు మా సంస్థను సొంత సంస్థగా భావిస్తారు. నేను కూడా వాళ్ల ఇంట్లో నిర్మాతగా ఫీలవుతాను. ఆయనతో సినిమా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. త్వరలోనే మా కాంబినేషన్లో సినిమా వస్తుంది" అని చెప్పారు కల్యాణ్.

అలాగే మరికొన్ని చిత్రాలను కూడా తమ సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్లాన్ చేస్తున్నామని ఆయన అన్నారు. రానా, సత్యదేవ్, రెజీనాలతో నిర్మించిన '1945 లవ్ స్టోరీ' చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్నప్పటికీ, కరోనా వల్ల కుదరలేదని, త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.

సత్యదేవ్ హీరోగా గోపీ గణేశ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నామనీ, ఫిబ్రవరిలో ఇది సెట్స్ కి వెళుతుందని తెలిపారు. అలాగే ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందనీ, ఇందులో ఓ స్టార్ హీరో నటిస్తారని చెప్పారు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలవుతుందని కల్యాణ్ తెలియజేశారు.  
Balakrishna
C.Kalyan
Rana Daggubati
Satyadev

More Telugu News