సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

09-12-2020 Wed 07:19
  • రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ 
  • 'రాధే శ్యామ్' తాజా షెడ్యూల్ పూర్తి
  • విజయ్ దేవరకొండ కొత్త సినిమా  
Kiara Advani in Acharya opposite Charan

*  చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చరణ్ సరసన రష్మిక నటిస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఆ పాత్రలో కియరా అద్వానీ నటిస్తుందట.
*  ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ముగిసింది. గత నెల రోజులుగా హైదరాబాదులో జరిగిన ఈ షెడ్యూలులో ఓ యాక్షన్ ఎపిసోడ్ ను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
*  ప్రస్తుతం నాని హీరోగా 'టక్ జగదీశ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు శివ నిర్వాణ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయనున్నాడు. వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.